క్వారంటైన్ లో ఉండడం నా వల్లకావడంలేదు.. బ్రెజిల్ అధ్యక్షడు - MicTv.in - Telugu News
mictv telugu

క్వారంటైన్ లో ఉండడం నా వల్లకావడంలేదు.. బ్రెజిల్ అధ్యక్షడు

July 14, 2020

కరోనా వైరస్ ప్రభావానికి అతలాకుతలం అవుతోన్న దేశాల్లో బ్రెజిల్ ఒకటి. ఇప్పటివరకు బ్రెజిల్ లో 70వేల కరోనా మరణాలు సంభవించాయి. ఆ దేశ అధ్యక్షుడు బోల్సెనారో కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన ఆయన ఐసోలేషన్‌లో ఉండే విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల సీఎన్‌ఎన్‌ బ్రెజిల్‌ ఛానల్‌కు ఫోన్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఫోన్ ఇంటర్వ్యూలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

‘ఐసోలేషన్‌లో ఉండలేకపోతున్నాను. ఈ రకంగా ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను. భయంకరంగా ఉంది. నాకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదు. బాగానే ఉన్నాను. మంగళవారం మరోసారి కరోనా పరీక్ష ఉంది. రేపు చేసే పరీక్ష ఫలితం ఎలా వస్తుందో తెలియదు. నెగటివ్ రావాలని కోరుకుంటున్నా. నేను మళ్లీ నా విధులను ప్రారంభించాలి. నా చుట్టుపక్కల వారిని కూడా పట్టించుకోవాలి. రిజల్ట్ నెగటివ్ వస్తే మరికొన్ని రోజులు ఎదురుచూస్తాను. ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్‌ల్లో విధులు నిర్వహిస్తున్నాను.’ అని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.