ఇంటర్వ్యూ చేస్తుంటే నగ్నంగా వచ్చేసిన భార్య! - MicTv.in - Telugu News
mictv telugu

ఇంటర్వ్యూ చేస్తుంటే నగ్నంగా వచ్చేసిన భార్య!

September 26, 2020

Brazilian TV Host's Wife Walks Naked

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో మెజారిటీ ప్రజలు ఇళ్ల నుంచే పనిచేశారు. మీడియా సంస్థల్లో పనిచేసే వారు కూడా ఇళ్ల నుంచే పనిచేశారు. కొందరు ఇళ్ల నుంచే వార్తలు చదివారు. మరికొందరు ఇళ్లనుంచి ఇంటర్వ్యూలు చేశారు. ఈ సందర్భంగా ఇంట్లో ఉన్నవాళ్ళ నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నారు. వీళ్ళు ఏంతో ఏకాగ్రతగా పనిచేస్తుంటే పెళ్ళాం, పిల్లలు మధ్యలో వచ్చి డిస్ట్రబ్ చేశారు.  

ఈ నేపథ్యంలో బ్రెజిల్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. టీవీ హోస్ట్, నటుడు ఫాబియో పర్చాట్ మొబైల్ ద్వారా ఇంటి దగ్గరే ఉండి ‘పొలిటికల్ లైవ్’ అనే ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఆ ఇంటర్వ్యూలో మాజీ బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి గుయిల్హెర్మే బౌలస్‌ పాల్గొన్నాడు. ఇద్దరూ సీరియస్‌గా లైవ్‌‌లో మాట్లాడుతున్న సమయానికి ఫాబియో భార్య బాత్రూమ్ నుంచి బయటకు వచ్చింది. అతడు అడ్డంగా కుర్చొని ఉండటంతో కుర్చి వెనుక నుంచి వంగుని నడుచుకుని వెళ్లింది. లైవ్‌ ఇంటర్వ్యూలో ఉన్న గుయిల్హెర్మే బౌలస్ ఆమెను చూశాడు. దీంతో ఆయన నవ్వు ఆపుకోలేకపోయాడు. అతడిని చూసి ఫాబియో కూడా నవ్వేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.