బ్రేకింగ్.. మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర - MicTv.in - Telugu News
mictv telugu

బ్రేకింగ్.. మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర

May 19, 2022

దేశవ్యాప్తంగా చమురు సంస్థలు ధరలను పెంచుతూ ప్రజలకు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాయి. గురువారం వంట గ్యాస్ వినియోగాదారులకు గట్టి షాక్‌ ఇచ్చాయి. వంటగ్యాస్ ధరలను మరోమారు పెంచుతూ ప్రకటన విడుదల చేశాయి. గృహ వినియోగ వంటగ్యాస్ ధర రూ. 3.50, వాణిజ్య సిలిండర్ ధర రూ. 8 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గ్యాస్ ధరలు పెరగడం ఈ నెలలో రెండోసారి. తాజా పెంపుతో డొమెస్టిక్ సిలిండర్ ధర దేశ వ్యాప్తంగా రూ. 1000 దాటేసింది. ఈ ధరతో..ఢిల్లీ, ముంబైలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 1003కు చేరుకోగా, కోల్‌కతాలో రూ. 1029, చెన్నైలో 1018.5కి చేరుకుంది. కాగా, ఈ నెల 7న సిలిండర్ ధరను ప్రభుత్వం ఏకంగా రూ. 50 పెంచిన విషయం తెలిసిందే.

ఇక, హైదరాబాద్ విషయానికొస్తే.. ఇటీవలే పెరిగిన వంటగ్యాస్ ధర ప్రకారం.. సిలిండర్ ధర రూ. 1,052గా ఉంది. డెలివరీ బాయ్ చార్జీలు కలుపుకొని, రౌండ్ ఫిగరుగా రూ. 1100 విక్రయిస్తున్నారు. తాజా పెంపుతో 1,055.50 చేరింది. ఇక 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,563.50 నుంచి 2,571.50కి చేరుకుంది.