బ్రేకింగ్..ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల - Telugu News - Mic tv
mictv telugu

బ్రేకింగ్..ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

June 22, 2022

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాసేపటి క్రితమే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. విజ‌య‌వాడ‌లో విద్యాశాఖ మంత్రి బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ నేడు ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను విడుద‌ల‌ చేశారు. విడుదల చేసిన ఫలితాలలో ఫస్టియర్‌లో 2,41,591 మంది పాసైయ్యారు (అంటే 54 శాతం) సెకండియర్‌లో 2,58,449 మంది అయ్యారు (అంటే 61 శాతం) అని అధికారులు పేర్కొన్నారు. ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలదే పైచేయిగా నిలిచారని విద్యాశాఖ అధికారులు వివరాలను వెల్లడించారు. రాష్టవ్యాప్తంగా 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, కేవలం 28 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ www.bie. ap gov. in, examresults. ap.nic.inలో ఫలితాలను చెక్ చేసుకోవాలని కోరారు.