బ్రేకింగ్.. నారాయణ విద్యాసంస్థల అధినేత అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

బ్రేకింగ్.. నారాయణ విద్యాసంస్థల అధినేత అరెస్ట్

May 10, 2022

టీడీపీ మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కొండాపూర్‌లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి సీఐడీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ఏపీలో గతకొన్ని రోజలుగా పదోవ తరగతి ప్రశ్నాపత్రాలు లీకేజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ లీకేజీల వ్యవహారంలో ఆయన పాత్ర ఏమైనా ఉందా? లేదా? అనే కోణంలో సీఐడీ అధికారులు ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం వెనుక నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఉన్నట్లు కొద్దిరోజుల క్రితం తిరుపతి సభలో జగన్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి నారాయణను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు.