Breaking .. Bonas in Telangana from June 30
mictv telugu

బ్రేకింగ్.. జూన్ 30 నుంచి తెలంగాణలో బోనాలు

June 6, 2022

Breaking .. Bonas in Telangana from June 30

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 30వ తేదీ నుంచి బోనాల జాతర మొదలుకానున్నాయని ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు తెలిపారు. కాసేపటి క్రితమే మీడియా సమావేశం ఏర్పాటు చేసి, జాతర తేదీలను, వివరాలను వెల్లడించారు.  ‘జులై 17న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు. 18న రంగం, భవిష్యవాణి కార్యక్రమం. జులై 24న భాగ్యనగర బోనాలు. 25న ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపు. జులై 28న గోల్కొండ బోనాలతో ఈ ఉత్సవాలు ముగిస్తాయి’ అని అన్నారు.

శ్రీనివాస్ యాదవ్‌ మాట్లాడుతూ..”నగరంలో చిన్నా పెద్దా తేడా లేకుండా 3వేల దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించాం. బోనాల పండుగ గొప్పగా చేయాలి. కల్చరల్, లైటింగ్, ఎల్సీడీ స్క్రీన్లతో ఘనంగా ఏర్పాట్లు చేయాలి. పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య బోనాల జాతర జరుగుతుంది. భక్తులు ఎక్కడ ఏలాంటి గొడవలు గాని, అల్లర్లు గాని చేయరాదు” అని అన్నారు.

ఇక, తెలంగాణలోని బోనాలకు ఓ ప్రత్యేకత ఉంది. రెండు వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ కాలంలో కాంట్రాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నగరవాసి ఉజ్జయినిలో పనులు నిర్వహించేవాడట. తమ ప్రాంతంలో కలరా, మశూచి, ప్లేగు వంటి రోగాలు వచ్చి, ప్రజలు చనిపోయారట. ఆ క్రమంలో తమ గ్రామ ప్రజల ప్రాణాలను కాపాడితే, తమ గ్రామ దేవతగా  కొలుస్తామని ఉజ్జయిన దేవతను మొక్కుకున్నాడట. కొద్ది రోజులకు కలరా, మశూచి వ్యాధులు పూర్తిగా తొలిగిపోయి, ప్రజలు ఆనందంగా గడిపరట. అప్పటి నుంచి ఉజ్జయిని అమ్మవారి పేరుతో ఉజ్జయిని మహంకాళీగా బోనాలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి.