Breaking: Minister Errabelli's brother Pradeep Rao will say goodbye to TRS
mictv telugu

బ్రేకింగ్: టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పనున్న మంత్రి ఎర్రబెల్లి సోదరుడు?

August 2, 2022

టీఆర్‌ఎస్‌ పార్టీకి మరో ముఖ్యనేత రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ మంత్రి వర్గంలో ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు పార్టీకి గుడ్ బై.. చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 7వ తేదీన టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ క్రమంలోనే రేపు తన అనుచరులతో ప్రదీప్‌ రావు ప్రత్యేక సమావేశం నిర్వహించి, టీఆర్‌ఎస్‌కు రాజీనామాతో పాటు తన భవిష్యత ప్రణాళికలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కాగా.. గతంలో టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు కొనసాగగా ఇప్పుడు ఆ పార్టీలోంచి ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోకి వలసలు ప్రారంభమయ్యాయి. భవిష్యత్ లో టీఆర్ఎస్ నుండి భారీగా వలసలు వుంటాయన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్న సమయంలో ఆ పార్టీకి షాక్ తగిలింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే 2024 ఎన్నికలే లక్ష్యంగా చేసుకొని టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. 2024లో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికే ఆయా పార్టీల జాతీయ నేతలు తెలంగాణలో పర్యటిస్తూ పార్టీల బలోపేతానికి ప్రయత్నాలు చేస్తున్నారు.