తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Film Industry )లో మరో విషాదం చోటుచేసుకుంది. అలనాటి మేటి నటీమణి జమున(86) కన్నమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్(Hyderabad)లోని తన నివాసంలోనే చికిత్స తీసుకుంటున్నారు. కాగా పరిస్థితి విషమించి శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. జమున(Jamuna) మరణవార్త తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
కాగా, ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, చలపతిరావు, కైకాల సత్యనారాయణ వంటి ప్రముఖుల మరణాన్ని మరువక ముందే జమున మృతిచెందడం చిత్ర పరిశ్రమకు చెందిన పలువురిని తీవ్రంగా కలిచి వేస్తోంది. ఉదయం 11 గంటల నుంచి ఫిల్మ్ చాంబర్(Film Chamber)లో ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని ఉంచనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
1936 ఆగష్టు 30న హంపి(Born in Hampi )లో జన్మించిన జమున. 1953 లో వచ్చిన పుట్టిల్లు సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి వంటి లెజెండ్స్‌తో చేసిన మిస్సమ్మ(Missamma) సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2008లో జమునకు ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ వరించింది. ఆ తర్వాత కాలంలో సినిమా సత్యభామగా పేరు పొందింది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్ భాషల్లో నటించారు. బంగారు పాప, వద్దంటే డబ్బు, దొంగరాముడు, సంతోషం, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణుడు, చిరంజీవులు, చింతామణి, భాగ్యరేఖ, గులేబకావళి కథ, గుండమ్మ కథ, బొబ్బిలి యుద్ధం, దొరికితే దొంగలు, కీలుబొమ్మలు, లేత మనసులు, మూగమనసులు, చదరంగం, శ్రీకృష్ణతులాభారం వంటి 150 చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా శ్రీకృష్ణతులాభారం సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా సత్యభామ పాత్రలో నటించినందుకు తెలుగు ప్రేక్షకులు ఆమెను కొనియాడారు. నటిగానే కాకుండా రాజకీయాల్లోనూ జమున రాణించారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజమహేంద్రవరం నుంచి లోక్‌సభకు ఆమె ఎన్నికయ్యారు.