Breaking..Previous by-election..Schedule released
mictv telugu

బ్రేకింగ్..మునుగోడు ఉపఎన్నిక..షెడ్యూల్ విడుదల

October 3, 2022

తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు షెడ్యూల్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందని వేయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాసేపటిక్రితమే కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది.

షెడ్యూల్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..”మునుగోడు ఉప ఎన్నికకు నగారా మోగింది. ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నాం. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నాం. ఉప ఎన్నికకు ఈనెల 7న నోటిఫికేషన్ విడుదల చేయనున్నాం.” అని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పేర్కొంది.

మరోపక్క ఇప్పటికే ఆయా పార్టీలు మునుగోడులో భారీ బహిరంగ సభలు నిర్వహించి, తమ పార్టీ అధికారంలోకి వస్తే, మునుగోడును ఏ విధంగా అభివృద్ది చేయనున్నాయో ఆ హామీలను ప్రజలకు వివరించాయి. అంతేకాదు, బీజేపీ అభ్యర్థిగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డిలను ఆయా పార్టీల అధిష్టానాలు ప్రకటించాయి. కానీ, అధికార పార్టీ మాత్రం ఇప్పటివరకూ అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ క్రమంలో షెడ్యూల్ విడుదల అవడంతో సంచలనంగా మారింది.