బ్రేకింగ్.. పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు - MicTv.in - Telugu News
mictv telugu

బ్రేకింగ్.. పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

May 20, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన పోలీసు ఉద్యోగాలకు సంబంధించి, వయోపరిమితిని పెంచుతూ అధికారులు కాసేపటి క్రితమే ప్రకటన విడుదల చేశారు. గతకొన్ని రోజులుగా నిరుద్యోగులు పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలని ధర్నాలు, నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ సర్కార్ నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని.. పోలీసు ఉద్యోగాలకు మరో రెండు సంవత్సరాల వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఐ ఉద్యోగాలకు 30 ఏళ్లు నిండినవారికి, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 27 ఏళ్లు నిండిన వారికి ఈ అవకాశం లభించనుంది. ఇక, ఈ పోలీసు ఉద్యోగాలకు ఈరోజుతో దరఖాస్తుల గడువు ముగుస్తుంది. ఇటువంటి సమయంలో ప్రభుత్వం వయోపరిమితిని పెంచుతూ తీపికబరు చెప్పినప్పటికి..ఈరోజే లాస్ట్ డేట్ కావడంతో అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. దరఖాస్తుల గడువును పెంచితేనే ఉద్యోగాలకు ఆప్లై చేసుకోవడానికి వీలు ఉంటుందని, గడువును పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.