బ్రేకింగ్.. వడ్డీరేట్లను పెంచేసిన ఆర్‌బీఐ - MicTv.in - Telugu News
mictv telugu

బ్రేకింగ్.. వడ్డీరేట్లను పెంచేసిన ఆర్‌బీఐ

June 8, 2022

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం ఓ కీలక విషయాన్ని తెలియజేసింది. వడ్డీరేట్లను మరోసారి పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు రెపోరేటును పెంచుతున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈ వడ్డీరేట్లపై మూడు రోజులపాటు చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఆ చర్చల్లో ఏఏ నిర్ణయాలు తీసుకున్నారో వాటికి సంబంధించిన వివరాలను గవర్నర్ శక్తికాంత దాస్ కాసేపటి క్రితమే ప్రకటించారు.

”గత నెలలో 40 బేసిస్ పాయింట్ల వరకు పెంచాం. తాజాగా 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచాం. దీంతో రెపోరేటు 4.00 శాతానికి చేరింది. అధిక ద్రవ్యోల్బణం దృష్ట్యా సరళ విధాన వైఖరిని క్రమ క్రమంగా సడలిస్తాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆర్‌బీఐ రెపోరేటు 5.6 శాతానికి చేరుతుంది” అని ఆర్‌బీఐ అంచనా వేస్తున్నట్లు తెలిపింది.

ఈ వడ్డీ రేట్లను ఆర్‌బీఐ సవరించిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం వడ్డీ రేట్లను పెంచనున్నాయి. దీంతో గృహ వినియోగదారులకు ఈఎంఐ భారం భారీగా పడనుంది. ఇక, ఇప్పటికే రుణం తీసుకున్న వారికి బ్యాంకులు ఈఎంఐలలో ఎలాంటి మార్పు చేయనప్పటికీ, ఈఎంఐలు కట్టాల్సిన నెలల సంఖ్య పెరుగుతుంది. ఆ లెక్కన సుదీర్ఘకాలం పాటు ఈఎంఐలు కట్టినప్పుడు ఆ విధంగా కట్టే వడ్డీ మొత్తం పెరుగుతుందని ఆర్థిక నిపుణులు తెలియజేశారు.