BREAKING: Sri Lanka declares state of emergency after president flees
mictv telugu

లంకలో ఎమర్జెన్సీ.. కనిపిస్తే కాల్చేయాలంటూ..

July 13, 2022

రాజకీయ సంక్షోభంతో శ్రీలంకలో మరోసారి అలజడి చెలరేగింది. నిరసనకారులు ఈసారి ప్రధాని కార్యాలయం మీద విరుచుకుపడ్డారు. ప్రధాని కార్యాలయాన్ని వాళ్లు తమ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి అదుపు తప్పడంతో బుధవారం ఎమర్జెన్సీ విధించింది అక్కడి ప్రభుత్వం. ఇక శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు, ప్రధాని రణిల్‌ విక్రమసింఘే.. మరోసారి ఆందోళనలు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై మిలిటరీ, పోలీసులతో చర్చలు జరుపుతున్నారు. నిరసనకారులపై కనిపిస్తే కాల్చివేయాలనే సంచలన నిర్ణయానికి వచ్చారు. మే 10వ తేదీన కూడా దాదాపు ఇలాంటి ఆదేశాలే జారీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే తన ఒక్కగానొక్క ఇంటికి నాశనం చేశారని బాధలో ఉన్న ప్రధాని రణిల్‌ విక్రమసింఘేకు.. తాజా పరిణామాలు మరింత అసహనానికి గురి చేస్తున్నాయి. దీంతో షూట్‌ ఎట్‌ సైట్‌ ఆర్డర్స్‌కే మొగ్గు చూపారు. మరికొన్ని గంటల్లో అధికారాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సుమారు 2 కోట్ల 10 లక్షల దాకా జనాభా ఉన్న శ్రీలంక నెలల తరబడి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కుటుంబ పాలనతోనే సర్వనాశనం అయ్యిందన్న వైఖరితో ఉన్న అక్కడి ప్రజలు.. రాజపక్స కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పోరాడుతున్నారు.