బ్రేకింగ్..ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత - MicTv.in - Telugu News
mictv telugu

బ్రేకింగ్..ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత

May 18, 2022

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ బుధవారం సీఎస్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే సుప్రింకోర్టు ఆయనపై సస్పెన్షన్‌ను ఎత్తివేసి, వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని, ఆయనకు చెల్లించాల్సిన జీతాన్ని చెల్లించి, సస్పెన్షన్ కాలాన్ని సర్వీసు కింద పరిగణించాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి వెళ్లి, సుప్రీంకోర్టు ఆదేశాలను అందించారు. తనను సర్వీసులోకి తీసుకోవాలని వినతిపత్రాన్ని అందజేశారు. కానీ, ఆ సమయంలో సీఎస్ అందబాటులో లేకపోడంతో రెండోసారి సీఎస్ కార్యాలయానికి వెళ్లి ఆయన వినతి పత్రాన్ని అందజేశారు. దాంతో ఏపీ ప్రభుత్వం ఆయనపై నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.