బ్రేకింగ్..తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

బ్రేకింగ్..తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

July 1, 2022

తెలంగాణ రాష్ట్రంలో కాసేపటిక్రితమే టెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. శుక‍్రవారం ఉదయం 11.30 గంటలకు టెట్ ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు తాజాగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారమే నేడు టెట్‌ ఫలితాలను విడుదల చేశారు.

టెట్ పరీక్షను రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం www.tstet.cgg.gov.in వెబ్‌‌సైట్లో చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే టెట్‌ ఫైనల్‌ కీని టెట్ కన్వీనర్ రాధారెడ్డి విడుదల చేశారు. జూన్‌ 12న నిర‍్వహించిన టెట్‌ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా పేపర్‌-1కు 3,18,506 మంది, పేపర్‌-2కు 2,51,070 మంది అభ‍్యర్థులు హాజరయ్యారు.