ఆంధప్రదేశ్‌లో నేడు వెల్లడించాల్సిన పదోవ తరగతి ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు కాసేపటి క్రితమే అధికారులు ప్రకటించారు. సోమవారం (జూన్ 6న) రోజున టెన్త్ ఫలితాలను విడుదల చేస్తామని విద్యాశాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పదోవ తరగతి ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు ప్రకటిస్తామని ఇటీవలే పేర్కొంది. ఫలితాలను అధికారిక వెబ్ సైట్ bse.ap.gov.inలో ఉంచుతామని, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు అంటూ వెల్లడించింది. కానీ, ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శనివారం ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. కానీ, చివరి నిమిషంలో అనివార్య కారణాల వల్ల ఫలితాలను విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 2021-22 ఏడాదికిగానూ ఏప్రిల్ 27నుంచి మే 9వరకు టెన్త్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.రాష్ట్రవ్యాప్తంగా 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు అధికారులు ఇదివరకే వివరాలను వెల్లడించారు.