ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాసేపటి క్రితమే పదోవ తరగతి పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు తాజాగా తెలియజేసిన విషయం తెలిసిందే. చెప్పిన విధంగానే మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలోని ఎమ్జీ రోడ్లో ఉన్న గేట్వే హోటల్లో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థిని, విద్యార్థులు అధికారిక వెబ్సైట్ www.results.bse.ap.gov.inలో రిజల్ట్స్ చూసుకోవాలని అధికారులు తెలిపారు.
ఏపీలో ఏప్రిల్ 27న టెన్త్ పరీక్షలు మొదలై, మే 9న పూర్తన విషయం తెలిసిందే. ఈసారి టెన్త్ పరీక్షలకు 6,22,537 మంది హాజరై, పరీక్షలను రాశారు. ఈ క్రమంలో పరీక్ష పత్రాలను సకాలంలో మూల్యాంకనం చేయడం కోసం. 20 వేల మంది ఉపాధ్యాయులకు అధికారులు విధులను కేటాయించారు. నేడు విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 6,15,208 మంది పరీక్షలు రాయగా, అందులో 4.14,281 మంది పాసయ్యారు. ఫలితాల్లో బాలికలే టాప్ ప్లేసులో ఉన్నారు. ఫలితాల్లో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, అనంతపురం జిల్లా చివరి స్థానంలో నిలిచింది.