చైతో విడిపోయి.. భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న: సమంత - MicTv.in - Telugu News
mictv telugu

చైతో విడిపోయి.. భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న: సమంత

March 2, 2022

03

‘నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నేను అత్యంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను’ అంటూ సమంత ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. తెలుగు చిత్రసీమ పరిశ్రమలో మోస్ట్ లవబుల్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య, సమంతలు గతంలో హఠాత్తుగా తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్తున్నాము అంటూ అందరికీ బిగ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సమంత తాను నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ‘అత్యంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను’ అంటూ ఆవేదన చెందింది.

అంతేకాకుండా 2022 నుండి తనకు జీవితంపై పెద్దగా ‘అంచనాలేవీ’ లేవని, నాలుగేళ్లుగా తన భర్త నాగ చైతన్యతో ఇటీవల విడిపోయిన విషయాన్ని గుర్తుచేసుకుంది. తాను తరచుగా ఎదుర్కొనే సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి ప్రస్తావించింది. విడిపోయిన నేపథ్యంలో తాను అనుభవించిన మానసిక బాధను పంచుకుంది. ”2021లో నా వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనతో నాకు ఎలాంటి అంచనాలు లేవు. ఎందుకంటే నేను జాగ్రత్తగా రూపొందించిన ప్రణాళికలన్నీ శిథిలమయ్యాయి. కాబట్టి నాకు ఎలాంటి అంచనాలు లేవు. భవిష్యత్తులో నా కోసం ఏదైతే భద్రంగా ఉంటుందో దానిని స్వీకరిస్తాను” దానికోసం బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని సమంత తెలిపింది.