Breathing tree in Canada
mictv telugu

ఊపిరి తీసుకుంటున్న చెట్టు.. వైరల్ వీడియో

August 9, 2022

చెట్లకు ప్రాణం ఉంటుందని మనకు తెలుసు. మొక్కల, చెట్ల ఎదుగుదలను, తగ్గుదలను చూస్తుంటాం కాబట్టి అవి పెరుగుతాయని, చనిపోతాయని తెలుసు. ప్రాణమున్నవి శ్వాసిస్తాయి. శ్వాసించలేనివి చచ్చిపోతాయి. అయితే చెట్లు శ్వాస తీసుకోవడం మనం ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఆ కొరత తీర్చడానికా అన్నట్లు ఓ చెట్టు చక్కగా శ్వాస తీసుకుంటూ కెమెరాకు చిక్కింది. తన కాండాన్ని కోసినట్లు తెరిచి ఊపిరి తీసుకుంది. ఇది కాస్తా ఎవరో చూడ్డం ఆ సీన్ కలకలం రేపుతోంది.

కెనడాలోని కాల్గరీ ప్రాంతంలో ఈ వింత చోటు చేసుకున్నట్టు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో బలమైన గాలులు, జడివానలు కురుస్తూ ఉంటాయి. ఫలితంగా ఆ చెట్లు అలా బీట వార్చి శ్వాస తీసుకుంటోందని చెబుతున్నారు. వాతావరణ ప్రభావం వల్లే చెట్లు చీలిపోయి మళ్లీ దగ్గరికి వచ్చినట్లు కొందరు చెబుతున్నారు. ఏదేమైనా ఒక చెట్లు అచ్చం మనిషిలా శ్వాస తీసుకోవడం వింతేనంటున్నారు నెటిజనులు..