50 లక్షలు ఆమ్యామ్యా.. షేక్‌పేట ఆర్ఐ, బంజారాహిల్స్ ఐఎస్! - MicTv.in - Telugu News
mictv telugu

50 లక్షలు ఆమ్యామ్యా.. షేక్‌పేట ఆర్ఐ, బంజారాహిల్స్ ఐఎస్!

June 6, 2020

Bribe Hyderabad revenue inspector and banarja hills police inspector detained

రెవెన్యూ, పోలీస్ విభాగాల్లో లంచం చేతిలో పడనిదే పనులు జరగవనే నానుడి మరోసారి రుజువైంది. ల్యాండ్ సెటిల్మెంటు కోసం హైదరాబాద్ షేక్‌పేట రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నాగార్జున రూ. 15 లక్షల లంచం తింటూ అడ్డంగా బుక్కయ్యాడు. ఆ కేసులో బంజారాహిల్స్ ఎస్ఐ రవీందర్ కూడా లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనను కూడా పట్టుకుని విచారిస్తున్నారు. 

బంజారాహిల్స్‌లోని కోట్ల విలువైన ఎకరంన్నర స్థల వివాదాన్ని పరిష్కరించడానికి వీరు డబ్బు బుక్కినట్లు తెలుస్తోంది. ఆ స్థలం ప్రభుత్వానిదని రెవెన్యూ విభాగం మార్క్ చేసింది. అయితే అది తనదంటూ సయ్యద్ అబ్దుల్ అనే వ్యక్తి కోర్టులో దావా వేశాడు. స్థలం అతనికే చెందుతుందని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సయ్యద్ ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ శాఖ అతనిపై కేసు పెట్టింది.   సెటిల్మెంట్ కింద రూ. 50 లక్షలు ఇవ్వాలని ఆర్‌ఐ నాగార్జున, ఎస్‌ఐ  రవీందర్‌ అడగడంతో సయ్యద్ ఏసీబీకి ఉప్పందించాడు. నాగార్జున లంచం కింద అడ్వాన్సుగా రూ.15 లక్షలు పుచ్చుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రవీందర్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అని ఆఫీసులో సోదాలు సాగుతున్నయి.