లంచం డబ్బులు తిరిగిచ్చేస్తా.. ఓ తహశీల్దార్ హామీ   - MicTv.in - Telugu News
mictv telugu

లంచం డబ్బులు తిరిగిచ్చేస్తా.. ఓ తహశీల్దార్ హామీ  

August 1, 2020

Bribe mro, kumram bheem district

లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయినా ‘అబ్బే అది లంచం కాదు, అప్పు, వడ్డీ..’ అని బుకాయించే అధికారులను చాలామందిని చూశాం. కానీ ఓ తహసీల్దార్ మాత్రం ‘చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది.. ’ అన్నట్లు లెంపలు వేసుకున్నాడు. తాను తిన్న గడ్డినంతా వెళ్లగక్కుతానని ముందుకొచ్చాడు. ఎవరి నుంచి ఎంత లాక్కున్నాడో వివరిస్తూ జాబితా కూడా రాశాడు. 

కొమరం భీం జిల్లా చింతమానెలపల్లిలో తహసీల్దార్ ఖాజా నియాజుద్దీన్ బాగోతం ఇది. అతడు అన్నం బదులు గడ్డి తింటున్నాడని ఫిర్యాదులు రావడంతో ఇటీవలే కలెక్టర్ చర్యలు తీసుకుని జిల్లా కేంద్రానికి బదిలీ చేశారు. ఖాజా వెళ్లిపోతున్నాడని తెలుసుకున్న లంచం బాధితులుఒక్కసారిగా మీద పడ్డారు. తీసుకున్న లంచాన్ని తిరిగి ఇవ్వాలని, లేకపోతే డీల్ ప్రకారం పని చేసి పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక డీల్స్ కుదరవు కనుక ఖజా దారికొచ్చాడు. ఒక్కో రైతు నుంచి 10 వేలు మొదలుకుని 70 వేల వరకు లంచన తీసుకున్నట్లు అతన రాసిచ్చాడు. ఈ నెల 18వ తేదీలోగా వారికి డబ్బులు ముట్టజెపుతానని హామీ ఇచ్చి సంతకం చేశాడు. అప్పటికిగాని బాధితులు అతణ్ని వదల్లేదు.