శవపేటికలో ఊరేగుతూ పెళ్లి మండపానికి - MicTv.in - Telugu News
mictv telugu

శవపేటికలో ఊరేగుతూ పెళ్లి మండపానికి

November 21, 2019

Bride Arrives in Coffin for Her Wedding

పెళ్ళి పందిరి దగ్గరికి వధువును పూలతో అలంకరించిన గంపలో తీసుకొని రావడం చూసి ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో పల్లకిలో తీసుకొని వస్తారు. పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అన్నట్లుగా ఘానా దేశంలో జరిగిన ఓ పెళ్లిలో వధువు శవపేటికలో పెళ్లి మండపానికి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. 

మొదట పెళ్లి మండపానికి శవ పేటికను తెస్తున్నారేంటని ఆశ్చర్యపోయిన అతిథులు.. అందులో నుంచి పెళ్లి కూతురు నవ్వుతూ దిగడాన్ని చూసి షాకయ్యారు. ఈ పెళ్లి ఎప్పుడు జరిగిందో తెలీదు కానీ దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. పెళ్లి కూతురును పెళ్లి వేదిక వద్దకు తీసుకొచ్చే ముందు.. ఆమెను శవ పేటికలో ఉంచారు. తరువాత దానిపై నల్లని వస్త్రాన్ని పరిచారు. కొద్ది సేపటి తర్వాత వధువరుల కేరింతల మధ్య ఆ నల్ల వస్త్రాన్ని తొలగించారు. పెళ్లి కూతురు ఆ శవ పేటిక నుంచి బయటకు వచ్చింది. పెళ్లి తర్వాత ఇక జీవితం ‘అంతే’ అని సింబాలిక్‌గా చెప్పేందుకు ఇలా చేసి చేసి ఉంటారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజెన్స్ వధువును డబ్ల్యూడబ్ల్యూఈ ఆటగాడు అండర్‌టేకర్‌తో పోలుస్తున్నారు.