మాఘమాసం వచ్చేసింది. పెళ్లి సందడి మొదలైపోయింది. కొన్ని వివాహాలు ఘనంగా జరుగుతుంటే..ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఓ వివాహం..పెళ్లి కొడుకు ఆత్రం కారణంగా అర్థాంతంగా ఆగిపోయింది. పెళ్లి కూతురు గదికి పెళ్లి కొడుకు పదేపదే వెళ్తుండంపై గొడవ జరిగి పెళ్లి క్యాన్సిల్ అయింది.
ఉత్తర్‌ప్రదేశ్ శివరాంపూర్ పట్టణంలో శివనాథ్ పటేల్ కుమార్తెకు, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ జవాన్ కుమారుడుకు అమిత్ కతియార్‌కు వివాహం నిశ్చయించారు. కళ్యాణోత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. సకల లాంఛనాలతో బరాతీల స్వీకరణ, స్వాగత కార్యక్రమం జరిగింది. అయితే పెళ్లికి ముందు వరుడు పదేపదే వధువు గదికి వెళ్ళి మాట్లాడటం పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు నచ్చలేదు. దీంతో అర్థరాత్రి అకస్మాత్తుగా పెళ్లికి నిరాకరించారు.
ఇదే ఘటనపై తన తండ్రితో కూడా పెళ్లికుమారుడికి గొడవ జరిగింది. ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.మొదట తండ్రి దాడి చేయగా..తర్వాత పెళ్లికొడుకు కూడా దాడికి దిగాడు చివరికి పెళ్లి కాస్త ఆగిపోయి..పంచాయతీ పోలీసుల వద్దకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వివాహవేదిక వద్దకు వచ్చి ఇరు కుటుంబాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పెళ్లి ఖర్చుల విషయంలో పోలీసుల సమసక్షంలో ఇరువర్గాలు మాట్లాడుకుని సెటిల్ చేసుకున్నారు.