సిగ్గులేకుండా డ్యాన్స్ చేస్తూ వచ్చిన పెళ్లికూతురు  - MicTv.in - Telugu News
mictv telugu

సిగ్గులేకుండా డ్యాన్స్ చేస్తూ వచ్చిన పెళ్లికూతురు 

February 4, 2020

Bride dance.

కాలం మారుతోంది. అభిరుచులు మారిపోతున్నాయి. పెళ్లి, పేరంటం, అంత్యక్రియలు.. సందర్భం ఏదైనా వెరైటీగా ఉండాలని జనం పరితపించిపోతున్నారు. ఎవరేమనుకుంటే మాకేంటి, మా టేస్టే సపరేట్ అనేస్తున్నారు. అందుకు ఈ నవవధువు డ్యాన్సే ఉదాహరణ. సాధారణంగా పెళ్లికూతుళ్లు సిగ్గుపడుతుంటారు. కొందరైతే ఎక్కడా లేని సిగ్గంతా తమదేని, ముఖం కూడా పైకెత్తరు. 

కానీ కేరళకు చెందిన అంజలి దీనికి పూర్తిగా భిన్నం. ఆమెకు డ్యాన్స్ బాగా వచ్చు. తన పెళ్లి కేవలం మధురానుభూతిలాగే కాకుండా అందరూ కలకాలం చెప్పుకునేలా ఉండాలని భావించింది. కల్యాణ మండపానికి డ్యాన్స్ చేసుకుంటూ వచ్చేసింది. ఆమె స్నేహితురాళ్లు కూడా వెనక చిందేస్తూ వచ్చేశారు. ‘మలైయిరు’ పాటకు ఆమె లయబద్ధంగా కాళ్లూ, చేతులూ, నడుమూ కదుపుతోంది చూడ్డానికి జనానికి రెండు కళ్లూ చాల్లేదు. సోషల్ మీడియాలో దీన్ని విపరీతంగా షేర్ చేస్తున్నారు. అయితే వీడియోలో పెళ్లికొడుకు జాడ కనిపించడం లేదు.