ప్రేమించి పెళ్లాడిన 2 గంటలకే వరుడి ఆత్మహత్య! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమించి పెళ్లాడిన 2 గంటలకే వరుడి ఆత్మహత్య!

February 13, 2020

uttar Pradesh.

ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లిచేసుకున్నాడు. బారాత్ బయల్దేరింది. దారి మధ్యలో టీకొట్టు కనిపించింది. పెళ్లికొడుకు టీ కావాలని అడిగాడు. బ్యాండు బాజా మధ్యలో టీ వచ్చేసింది. కానీ పెళ్లికొడుకే లేకుండా పోయాడు. రెండు కిలోమీటర్ల దూరంలో చెట్టుకు ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించాడు. ఉత్తరప్రదేశ్’లోని బరేలీ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. 

అయితే తన భర్త మృతి వెనుక ఏదో కుట్ర ఉందని నవ వధువు ఆరోపిస్తోంది. పెట్రోలు బంకులో పనిచేసే దుష్యంత్ గిరి అనే యువకుడి విషాదగాథ ఇది. అతని మృతదేహాన్ని చూసి వధువు గుండెలు అవిసేలా రోదించింది. దుష్యంత్ ఉరి వేసుకుని చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని పోలీసులు చెప్పారు. వధువును ఆమె పుట్టింటికి పంపించామని, ఆత్మహత్యకు కారణాలేంటో తెలుసుకోడానికి విచారణ జరుపుతామని చెప్పారు.