దళితుడి పెళ్లికి 80 మంది పోలీసులతో కాపలా..  - MicTv.in - Telugu News
mictv telugu

దళితుడి పెళ్లికి 80 మంది పోలీసులతో కాపలా.. 

February 5, 2020

మానవుడు గ్రహాలను దాటి నక్షత్రాలపైనా పరిశోధనలు చేస్తున్న కాలం ఇది. కానీ కొందరు ఇంకా పాతబూజునే పట్టుకుని వేలాడుతున్నారు. కులవివక్షతో మానవతకే మచ్చ తెస్తున్నారు. దళితులు కోరమీసం పెట్టుకున్నారని, గుర్రం ఎక్కారని, చెప్పులతో వెళ్లారని దాడులు చేస్తున్న సంఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. చివరికి పెళ్లిళ్ల ఊరేగింపు కూడా నిషిద్ధంగా మారిపోయింది. దీంతో ఓ దళితుడు తన పెళ్లి నిరాటంకంగా సాగేందుకు పోలీసుల రక్షణ కోరాడు. 

రాజస్తాన్ రాష్ట్రంలోని బుండీ జిల్లా జారా గ్రామానికి చెందిన పరశురామ్‌ మేఘ్వల్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అతనికి ఈ నెల 4న నిశ్చితార్థం జరిగింది. సమీప ప్రాంతంలోని అగ్రవర్ణాలు దళితుల పెళ్లి ఊరేగింపులను అడ్డుకుంటున్నారు. పరశురామ్ పెళ్లి ఊరేగింపును కూడా వారు అడ్డుకుంటారని అతని కుటుంబ సభ్యులు పోలీసుల రక్షణ కోరారు. గత సంఘటనలను దృష్టిలో ఉంచుకున్న పోలీసు అధికారులు 80 మంది పోలీసులను అతని పెళ్లికి రక్షణగా పంపారు. అటూ ఇటూ పోలీసులు నడుస్తుండగా బారాత్, ఇతర ప్రీవెడ్డింగ్ కార్యక్రమాలు సాగాయి.