పెళ్లి పీటలు ఎక్కబోతున్న వధువు హత్య - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి పీటలు ఎక్కబోతున్న వధువు హత్య

July 6, 2020

Bride passed away in madhya pradesh

కొన్ని గంటలు గడిస్తే పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాల్సిన ఓ యువతి హత్యకు గురైంది. ఈ దారుణం మధ్యప్రదేశ్ లోని రాట్లాం జిల్లాలోని జోరా పట్టణంలో ఆదివారం ఉదయం జరిగింది. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. షాజాపూర్ లో ఉంటున్న సోనూ యాదవ్‌ అనే యువతికి మూడేళ్ల క్రితం ఓ ఫంక్షన్‌లో రామ్‌ యాదవ్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త క్రమంగా ప్రేమగా మారింది. కొన్ని రోజులకు విభేదాలు వచ్చి ఈ జంట విడిపోయింది. దీంతో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సోను రెడీ అయింది. సోను కుటుంబ సభ్యులు జూలై 5న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి చేయడం కోసం సోనుని షాజాపూర్ నుంచి జోరా పట్టాణానికి తీసుకుని వచ్చారు. పెళ్లికి కొన్ని గంటల ముందు బ్రైడల్‌ మేకప్‌ కోసమని సోను తన కజిన్‌తో కలిసి దగ్గర్లోని బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. 

సోనుని చంపాలనే ఉద్దేశ్యంతో అప్పటికే రామ్‌ యాదవ్‌ జోరాకు చేరుకున్నాడు. సోనూ పెళ్లి జరిగే ఫంక్షన్ హాలు కోసం వెతికాడు. అయినా ఆమె ఆచూకీ తెలియరాలేదు. సోముకి పదే పదే ఫోన్‌ చేసినా ఆమె లిఫ్ట్‌ చేయలేదు. దీంతో తన స్నేహితుడు పవన్‌ పంచాల్‌ ఫోన్‌ నుంచి కాల్‌ చేసి.. ఎలాగోలా ఆమె బ్యూటీపార్లర్‌లో ఉన్నట్లు తెలుసుకున్నాడు. వెంటనే అక్కడికి వెళ్లి సోనూ గొంతు కోశాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. తర్వాత‌ పవన్‌తో కలిసి బైక్‌పై రాజస్థాన్‌కు పారిపోయాడు. కాగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు.‌ పగతోనే రామ్‌ ఈ హత్యకు పాల్పడినట్లు అతడు వెల్లడించాడు. రాజస్థాన్‌ సరిహద్దు వద్ద రామ్‌ను దింపినట్లు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రామ్‌ యాదవ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.