bride postponed first night and escaped with jewellery in Chhattisgarh
mictv telugu

శోభనం వేళ వధువుకు పీరియడ్స్.. తర్వాత దిమ్మతిరిగే షాక్..

May 14, 2022

bride postponed first night and escaped with jewellery in Chhattisgarh

శోభనం గదిలోకి పాల గ్లాసు వెళ్లిన వధువు చూసి మురిసిపోయాడా కొత్త పెళ్లి కొడుకు. తన బ్రహ్మచర్యానికి సన్యాసమిచ్చే సమయం ఆసన్నమైందని సంతోషించేలోపే .. వధువు పీరియడ్స్ అని చెప్పడంతో షాక్ అయ్యాడు. ప్రస్తుతం కుదరదని, మరో వారం రోజులపాటు శోభనాన్ని వాయిదా వేయాలని చెప్పిన ఆమెపై కేసు పెట్టారు వరుడు, అతని కుటుంబ సభ్యులు. అయితే కేసు పెట్టడానికి కారణం మాత్రం శోభనం వాయిదా కాదు. ఆ కథ వేరే ఉంది.

విషయం ఏంటంటే… మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాహుల్‌ 10 రోజుల క్రితం లలిత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. బంధువుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లైన మూడు రోజుల తర్వాత నవ దంపతులకు బంధువులు శోభనం ఏర్పాటు చేశారు. ఇంతలో పీరియడ్స్ అని శోభనాన్ని వాయిదా వేసింది. సరిగ్గా వారం గడిచే సరికి నవ వధువు లలిత.. అత్తగారి ఇంట్లో ఉన్న రూ.3 లక్షల నగదుతోపాటు బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలతో మూటకట్టుకుని తెల్లారేసరికి పరారీ అయింది. ఈ విషయం తెలిసి అత్తమామలు షాకై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈ దొంగ వధువు లలిత.. మరి కొంతమందితో ముఠాగా ఏర్పడి దొంగ వివాహాలు చేసుకుంటూ మోసం చేస్తున్నట్లు తేలింది. నకిలీ ఐడీలతో మ్యాట్రిమోనిల్లో ఫొటోలు పెడుతూ మోసాలకు పాల్పడుతారని, వారంతా ఓ కుటుంబంగా చెప్పుకుంటూ అబ్బాయిల కుటుంబాలలో డబ్బు, నగలతో ఉడాయిస్తారని తెలిసి రాహుల్ , అతని కుటుంబం షాక్‌లో ఉండిపోయింది.