Bride traveled in boat surrounded by Godavari flood
mictv telugu

వరదలోనే వెళ్లిన పెళ్లికూతురు.. ముహూర్త బలం!

July 16, 2022

కల్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదని సామెత. వరదలను, భూకంపాలను, మరెన్నో ప్రకృతి విపత్తులను దీనికి జత చేసుకోవచ్చనే ఉదతంతాలు తరచూ చోటుచేసుకుంటూ ఉంటాయి. తాజాగా కోనసీమ జిల్లాలో అలాంటి పెళ్లొకటి జరిగింది. వధువు వరదలను లెక్కచేయకుండా పడవలో కల్యాణమంటం చేరుకుని అనుకున్న ముహూర్తానికి వరుణ్ని పెళ్లాడింది. పల్లకీ ఎక్కినట్టు పడవను ఎక్కి వెళ్లిపోతున్న ఆమె వీడియలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మామిడికుదురు మండలం పెదపట్నంలంక లంకపేటకు చెందిన నల్లి ప్రశాంతికి, మలికిపురం మండలం కేశనపల్లికి చెందిన గంటా అశోక్‌కుమార్‌తో పెళ్లి కుదిరింది. గురువారం ముహూర్తం. పెదపట్నంలంకను గోదావరి వరద దిగ్బంధం చేసింది. అయితే ముహూర్తం తప్పిపోకడదని అమ్మాయి బంధువులు సాహసం చేశారు. ప్రశాంతి, మరికొంతమంది దగ్గరి బంధువులు పడవపై అప్పనపల్లి కాజ్‌వే చేరుకున్నారు. తర్వాత కేశనపల్లికి చేరుకున పెళ్లిమంటపం చేరుకున్నారు. కొద్దిగా ఆలస్యమైనా ముహూర్తానికే పెళ్లి జరిగిపోయింది.