పెళ్లికొడుకు అరెస్ట్.. అమ్మో, కాస్త ఆలస్యమై ఉంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లికొడుకు అరెస్ట్.. అమ్మో, కాస్త ఆలస్యమై ఉంటే..

December 8, 2019

Bridegroom.

అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి పెళ్లిచెయ్యమంటారు పెద్దోళ్లు. మరీ అంత లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదుగాని, వధూవరుల నేపథ్యంపై కాస్తయినా ఆరా తీయాలి. లేకపోతే కర్నూలు జిల్లా నంద్యాల్లో జరిగిన సన్నివేశాల్లాంటికి ఎదురుకావొచ్చు. కాసేపట్లో తాళికట్టబోతున్న పెళ్లికొడుక్కి చేతికి బేడీలు పడ్డాయి అక్కడ. 

మోహన కృష్ణ అనే మాంచి ముదురు పెళ్లికొడుకు ఎస్‌బీఐలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి నంద్యాలకు చెందిన యువతితో పెళ్లి కుదిరింది. రూ. 17 లక్షల కట్నం తీసుకున్నాడు. ఈ రోజు పెళ్లి జరాగాల్సి ఉంది.  జీలకర్ర బెల్లం పెట్టే వేళకు సమయం చూసుకుని పోలీసులు బిలబలా వచ్చి ‘పీటలపై నుంచి లెయ్యవోవ్ పెళ్లికొడకా.. ’ అన్నారు. దీంతో వధువు తరఫువారు షాక్ అయ్యారు. తర్వాత పోలీసులు అసలు విషయం చెప్పారు. మోహనకృష్ణుడికి గతంలో మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకుంటాని చెప్పి రూ.12లక్షల కట్నం తీసుకున్నాడని, నిశ్చితార్థం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆ సంగతి దాచిపెట్టి మీ అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని వివరించారు. తాళి కట్టకముందే పోలీసులు రావడంతో తమ అమ్మాయికి మేలు జరిగిందని వధువు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. మక్తల్ యువతి తల్లిదండ్రులకు మోహన కృష్ణ మోసం తెలిసి పోలీసులకు ఉప్పు అందించారు. పోలీసులు వెంటొచ్చిన ఆ అమ్మాయి బంధువులు అతనికి మరచిపోకుండా ‘నలుగు’ కూడా పెట్టి కసి తీర్చుకున్నారు.