వరుడి మర్మాంగాన్ని కోసుకుని తీసుకెళ్లారు! - MicTv.in - Telugu News
mictv telugu

వరుడి మర్మాంగాన్ని కోసుకుని తీసుకెళ్లారు!

February 2, 2018

నేరాలు పలురకాలు.. డబ్బు కోసం హత్యలు చేస్తారు.. పరువు కోసం జంటల గొంతులు పిసుకుతారు. ఇక ప్రేమలో ఫెయిలయిన ఉన్మాదులు చేసే నేరాలకైతే లెక్కలేదు. అమ్మాయిలపై యాసిడ్ దాడులనుంచి హత్యలవరకు ఎన్నెన్నో చేస్తుంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే నేరం మాత్రం అరుదైనది. మధ్యప్రదేశ్‌లో మరో ఐదురోజుల్లో పెళ్లిపీటలు ఎక్కి, కళకళలాడాల్సిన వరుడి మర్మాంగాన్ని గుర్తుతెలియని దుండగులు కోసుకుని తమ వెంట తీసుకుపోయారు.. !

ఎవరు ఈ అమానుషానికి పాల్పడ్డారో తెలియడం లేదు. మోరెనా జిల్లాలో ఓ గ్రామంలో గురువారం ఉదయం ఈ దారుణం జరిగింది. 25 ఏళ్ల సదరు యువకుడికి ఈ నెల 6 పెళ్లి కావాల్సి ఉంది. అతడు గురువారం పొద్దున కాలకృత్యాలు తీర్చుకోవడానికి నది దగ్గరికి వెళ్లాడు. అదే సమయంలో ఇద్దరు దుండగులు అక్కడికొచ్చి అతనిపై దాడి చేశారు. తర్వాత పొదల్లోకి తీసుకెళ్లి ఒడిసిపట్టుకుని మర్మాంగాన్ని కోసి, తమ వెంట తీసుకుపోయారు.

రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుణ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కోసేసిన మర్మాంగాలు ఉండుంటే సర్జరీ చేసి అతికించే వారిమని వైద్యలు చెప్పారు. పోలీసులు, వరుడి బంధుమిత్రులు ఘటనాస్థలిలో వాటి కోసం వెతికినా ఫలితం లేదకపోయింది. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని వరుడి కుటుంబం చెబుతోంది. అతని పెళ్లిని చెడగొట్టాలనే ఎవరో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.