అందరూ పెళ్లివేడుకలో బిజీగా ఉన్నాడు. కాసేపట్లో ముహూర్తం..వధువు మెడలో తాళి కట్టడానికి రెడీ అయ్యాడు వరుడు…ఇంతలో ఆపండిపెళ్లి.. కేకలు వినిపించాయి. వచ్చిందీ పోలీసులు మాత్రం కాదు..ఓ అమ్మాయి. తలకు గన్ పెట్టి..వధువు మెడలో తాళి కట్టేందుకు రెడీగా ఉన్న వరుడ్ని ఈ తుపాకీ రాణి ఎత్తుకెళ్లింది. ఇంతకీ ఈమె ఎవరో తెలుసా..పెళ్లికొడుకు మాజీ లవర్.
ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఈ ఘటన జరిగింది. ప్రేమించిన వాడు మరొకరిని పెళ్లి చేసుకుంటుంటే.. ఆ అమ్మాయి చూస్తూ కూర్చోలేదు. తనతో పెళ్లికి నిరాకరించి మరొకరి మెడలో తాళి కట్టడానికి సిద్ధమైన వరుడు అశోక్ యాదవ్. కిడ్నాప్ చేసింది. ఇద్దరు యువకులతో కలిసి ఆమె మండపానికి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
కొన్ని నెలల కిందట వీళ్లిద్దరు పనిచేసే చోట కలిశారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు కూడా పుకార్లు వచ్చాయి. అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు మరో మహిళను పెళ్లి చేసుకోవడానికి అశోక్ సిద్ధమయ్యాడు.కానీ కళ్ల ముందే తనకు కాబోయే వాడిని ఎవరో అమ్మాయి ఎత్తుకెళ్లడంతో ఆ పెళ్లి కూతురు షాక్ తింది. పెళ్లికూతురు కుటుంబ సభ్యులు వరుడిని ఎవరో కిడ్నాప్ చేసినట్లు పోలీసుల దగ్గర ఫిర్యాదు చేశారు.
ఇందులో ట్టిస్టేటంటే ఆ తుపాకీ రాణి చేసిన చర్యను పోలీసులు సమర్థించడం. మోసం చేసిన వారిని ఇలా శిక్షించే వాళ్లు ఉండటం మంచిదే అని అంటున్నారట.
HACK:
- Bridegroom kidnapped by his Ex-Girlfriend by pointing gun in his marriage venue with another lady in Uttar Pradesh.