సినిమా కథ కాదు..వరుడి తండ్రితో వధువు తల్లి జంప్ - MicTv.in - Telugu News
mictv telugu

సినిమా కథ కాదు..వరుడి తండ్రితో వధువు తల్లి జంప్

January 21, 2020

bbhh

వరుడి తండ్రితో వధువు తల్లి జంప్..వినడానికి బాలీవుడ్ సినిమా కథలా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ఈ వింత సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో జరిగింది. సూరత్‌కు చెందిన యువతీ యువకుడికి పెద్దలు పెళ్లి నిశ్చయించి దాదాపు సంవత్సరం అవుతోంది. ఫిబ్రవరిలో పెళ్లి జరగాల్సి ఉంది. అందుకోసం ఇరు కుటుంబసభ్యులు చకచకా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు, రాకపోకలు పెరిగాయి. 

ఇంతలో ఎవ్వరూ ఊహించని సంఘటన జరిగింది. వరుసకు అన్నాచెల్లెళ్లు అయ్యే వరుడి తండ్రి(48), వధువు తల్లి(46) ప్రేమలో పడ్డారు. తమ బంధాన్ని ఎవరూ అంగీకరించరన్న అంచనాకు వచ్చారు. దీంతో 10రోజుల క్రితం ఇద్దరూ కలిసి పరారయ్యారు. ముందుగా నావసారిలో ఉన్న వధువు తల్లి తన ఇంటి నుంచి పరారైంది. ఆమె కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఎంత దొరికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈలోగా కాటర్గలో ఉంటున్న వరుడు తండ్రి కూడా మిస్ అయ్యాడు. దీంతో వీరిపై అనుమానం వచ్చింది. వీరి బంధంపై బంధువులను ఆరా తీయగా అసలు నిజం బయటపడింది. వీరిద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉందని, అదికాస్తా ప్రేమగా మారిందని తేలడంతో అందరూ షాకయ్యారు. తమ బిడ్డల పెళ్లి జరిగితే అన్నాచెల్లెలి వరుసగా మారాల్సి వస్తుందన్న ఆందోళనతో పెళ్ళికి ముందే వారిద్దరూ పరారైనట్లు సమాచారం. వీళ్ళ నిర్వాకంతో వివాహాన్ని బంధువులు రద్దు చేశారు.