Bridge Collapse Incidents: almost 500 members Died in last 20 year in all over World
mictv telugu

ఒక్క గుజరాత్‌లోనే కాదు.. బ్రిడ్జి కూప్పకూలిన ఘటనలు మరెన్నో..

October 31, 2022

Bridge Collapse Incidents: almost 500 members Died in last 20 year in all over  World

గుజరాత్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ఇప్పటివరకూ 141 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం వంద మంది మాత్రమే నించోగల కేబుల్ బ్రిడ్జిపై దాదాపు 400 మంది ఒకేసారి నడవడంతో ఈ ఘోరం జరిగిందంటున్నారు కొందరు. మరికొందరు ఎవరో ఆకతాయిలు చేసిన తుంటరి పని వల్లే ఈ ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు. వంద మందికి పైగా చనిపోగా మిగతావారి జాడ ఇప్పటికీ దొరకలేదు. అయితే ఇలాంటి బ్రిడ్జి కూలినటువంటి దారుణ ప్రమాదాలు గతంలోనూ జరిగాయి.

గడిచిన 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రమాదాలను ఒకసారి పరిశీలిస్తే.. 2021లో మెక్సికోలో నిర్మాణంలో ఉన్న సిటీ మెట్రో స్టేషన్ లో కొంతభాగం కూలిపోయింది. దీంతో ఓ ప్యాసింజర్ రైలు కూలి, 26మంది ప్రయాణికులు చనిపోయారు. 2018లో ఇటలీలోని జెనోవా నగరంలో.. ఫ్రాన్స్‌ను ఇటలీని కలిపే హైవేపైన నిర్మించిన ఓ బ్రిడ్జి కూలిపోవడంతో వాహనాలు కిందపడ్డాయి. ఈ ప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు.

Bridge Collapse Incidents: almost 500 members Died in last 20 year in all over  World

2016లో కోల్‌కతాలో ఓ ఫ్లైఓవర్ కూలిపోవడంతో 26 మంది మృత్యువాత పడ్డారు. 2011లో డార్జిలింగ్ సమీపంలోని ఓ బ్రిడ్జిపై జనం కిక్కిరిసిపోవడంతో అకస్మాత్తుగా కూలింది. దీంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 2007లో చైనాలోని హునాన్ ప్రావిన్స్ లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలి 64 మంది వర్కర్లు మృత్యువాత పడ్డారు. అదే ఏడాది నేపాల్ లో భేరీ నదిపై కట్టిన వంతెన కూలిపోవడంతో జరిగిన ప్రమాదంలో 16 మంది చనిపోయారు.

Bridge Collapse Incidents: almost 500 members Died in last 20 year in all over World

2006లో పాకిస్థాన్ లో భారీ వర్షాలకు మార్దాన్ లోని ఓ బ్రిడ్జి కూలి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే ఏడాది డిసెంబర్ లో బీహార్ లోని పురాతన బ్రిడ్జి ఒకటి కూలి ప్యాసెంజర్ ట్రైన్ కు ప్రమాదం జరగడంతో 34 మంది చనిపోయారు. 2003 ఆగస్టులో ముంబైలో వంతెన కూలి నదిలో పడడంతో 20 మంది మరణించారు. ఇందులో 19 మంది చిన్న పిల్లలే. డిసెంబర్‌లో బొలీవియాలో ఓ బ్రిడ్జి దాటుతున్న బస్సు.. వరదలకు నీట మునిగి అందులో ప్రయాణిస్తున్న 29 మంది మృత్యువాత పడ్డారు.