51వేల ఇటుకలపై రామనామం..అయోధ్య ఆలయానికి విరాళం - MicTv.in - Telugu News
mictv telugu

51వేల ఇటుకలపై రామనామం..అయోధ్య ఆలయానికి విరాళం

November 23, 2019

అయోధ్యలో భూ వివాదాన్నిసుప్రీం కోర్టు  పరిష్కరించడంతో అక్కడ ఆలయ నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. రామ మందిర నిర్మాణానికి దాతలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఆలయం కోసం ఇప్పటికే ఓ భారీ గంటను తయారు చేయిస్తున్నారు. ఇటీవల అమిత్ షా కూడా భారీ ఆలయాన్ని నిర్మిస్తామని ప్రకటించారు.ధార్మిక నగరి అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భక్తుల నుంచి భారీగా విరాళాలు వస్తున్నాయి.

Rama Mandir.

ఓ ఇటుక బట్టీ యజమాని కూడా రామాలయం కోసం తన వంతు సాయానికి ముందుకు వచ్చారు. తన తరుపున గర్భాలయంలో నిర్మాణానికి కావాల్సిన ఇటుకలను దానం చేస్తానని అయోధ్యకు చెందిన సందీప్ వర్మ ప్రకటించారు. అన్ని ఇటుకలపై రామ నామంతో 51 వేలు ఇస్తానని తెలిపారు. ఇప్పటికే వీటి పనులు కూడా ప్రారంభం అయ్యాయ. మొత్తం 18 బట్టీలలో ఇటుకలు తయారు చేయిస్తున్నారు. త్వరలోనే వీటిని ఆలయ కమిటీకి అప్పగించనున్నారు. కాగా సుప్రీం తీర్పు తర్వాత రామేశ్వరం నుంచి కూడా కొంత మంది భక్తులు వచ్చి ఇటుకలు విరాళంగా ఇచ్చారు. తమ తలపై మోసుకొచ్చి స్వామికి భక్తితో సమర్పించారు.