రియాలిటీ షోలో హద్దులు దాటిన మహిళా పోలీస్.. ఉద్యోగం హుష్.. - MicTv.in - Telugu News
mictv telugu

రియాలిటీ షోలో హద్దులు దాటిన మహిళా పోలీస్.. ఉద్యోగం హుష్..

August 13, 2019

Big Brother.

ఓ రియాలిటీ షోలో కెమెరాల ముందే ఓ జంట శృంగారంలో పాల్గొంది. దీంతో సదరు పోలీస్ అధికారిపై వేటు పడింది. ఆఫ్రికాలోని ఓ టీవీ ఛానెల్‌లో జూన్ 30న మొదలైన నైజీరియన్ ‘బిగ్ బ్రదర్’ షోలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ షో ‘బిగ్‌బాస్’కు మాతృక అని చెప్పవచ్చు. పాశ్చాత్య దేశాల్లో ‘బిగ్ బ్రదర్’ రియాల్టీ షో బాగా పాపులర్. ‘బిగ్‌బాస్’ తరహాలో ‘బిగ్ బ్రదర్’ హద్దుల్లో వుండదు. అందులో సెలబ్రిటీల రొమాన్స్‌ను కూడా బాహాటంగా చూపిస్తారు. ఈ క్రమంలో లండన్‌కు చెందిన 29 ఏళ్ల ఖాఫీ కరీమ్ అనే మహిళా పోలీస్ అధికారి ‘బిగ్ బ్రదర్’ షోలో పాల్గొంది. 

ఈ షోలో పాల్గొనేందుకు స్కాట్ ల్యాండ్ యార్డ్ (లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్) నుంచి ఆమెకు అనుమతి లభించలేదు. అయినా ఆమె తన యూనిఫాంతో షోలో ఎంట్రీ ఇచ్చింది. సుమారు నెల రోజులు ‘బిగ్ బ్రదర్’ షోలో వుంది. దీంతో ఆమెకు ఓ సెలబ్రిటీతో చనువు ఏర్పడింది. అదికాస్తా వారిమధ్య శరీరక సంబంధానికి దారితీసింది. హౌస్‌లో రొమాన్స్ మొదలైన రోజు నుంచి ఇప్పటివరకు వారిద్దరూ మూడుసార్లు శృంగారంలో పాల్గొన్నట్లు ఓ వెబ్‌సైట్ పేర్కొంది. 

ఆమె ఆ ఇంటి నుంచి బయటకు రావడానికి ఇంకా 70 రోజులు ఉన్న నేపథ్యంలో గర్భవతి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపింది. అయితే ఆమె పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి అనుమతి తీసుకోకుండా ‘బిగ్‌బ్రదర్’ షోలో పాల్గొన్నందుకు.. లండన్ పోలీస్ ఉన్నతాధికారులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆమెపై విచారణ మొదలుపెట్టారు. షో నుంచి ఆమె తిరిగి వచ్చేసరికి ఉద్యోగం వుంటుందా ఊడుతుందా అనేది చెప్పలేమని అధికారులు వెల్లడించారు. అంతటితో ఆగకుండా.. ఆమె లండన్ పోలీస్ అధికారిగా ఉండి క్రమశిక్షణ తప్పడంపై కూడా చర్యలు తీసుకోనున్నారని అధికారులు తెలిపారు. 

కాగా, ఈ షో 1999లో నెదర్లాండ్ దేశంలో మొట్టమొదటిసారి మొదలైంది. ఆతర్వాత మెల్లగా మనదేశంలో బిగ్‌బాస్‌గా మారింది. హిందీలో 12 సీజన్‌లు ముగించుకుంది. ఇదే పేరుతో కన్నడలో సుదీప్ హోస్ట్‌గా చేస్తున్నారు, తమిళంలో కమల్ హాసన్ హోస్ట్‌గా చేస్తున్నారు. ఇప్పుడు తెలుగులో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా సీజన్ 3 ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.