Britain agrees to extradite Julian Assange to US
mictv telugu

వికీలీక్స్ అసాంజేకు బ్రిటన్ షాక్.. అప్పగింతకు ఆమోదముద్ర

June 17, 2022

Britain agrees to extradite Julian Assange to US

రహస్య సమాచార సేకరణతో సంచలనం సృష్టించిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే విషయంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసాంజేను అమెరికాకు అప్పగించాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు ఫైలుపై బ్రిటన్ హోం మంత్రి ప్రతి పటేల్ సంతకం చేశారు. అంతకు ముందు ఈ వ్యవహారం అనేక కోర్టులలో అప్పీలుకు వెళ్లింది.

జూన్ 17న మెజిస్ట్రేటు కోర్టుతో పాటు హైకోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చాయి. అయితే ఈ తీర్పులపై కోర్టుకెళ్లేందుకు అసాంజేకు 14 రోజుల గడువు ఉంది. దీంతో ఆయన బృందం మరోసారి అప్పీలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఆస్ట్రేలియా పౌరుడైన అసాంజేపై ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్దాలకు సంబంధించి అమెరికా రహస్య పత్రాలను లీక్ చేశారన్న ఆరోపణ ఉంది. వికీలీక్స్ పేరుతో ప్రపంచ దేశాల్లోని అనేక రహస్యాలను బహిర్గతం చేసి ఒక్కసారిగా హీరో అనిపించుకున్నాడు. అప్పటినుంచి అసాంజే బాధిత దేశాలు అతని కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ ముప్పును గమనించిన అసాంజే.. చాలా కాలం పాటు బ్రిటన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో తల దాచుకున్నాడు.