బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ తను అఫ్ఘానిస్తాన్ యుద్ధంలో 25 మంది తాలిబన్లను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపానని ఇదివరకు చేసిన ప్రకటనపై విమర్శలు వచ్చాయి. సైన్యం పనిచేసినవాళ్లు అలా గొప్పలు చెప్పుకోవడం సరికాదని, వీరోచితంగా పోరాడినా అనామకంగా మిలిగిపోయిన యోధులు ఎందరో ఉన్నారని ఆక్షేపణలు వచ్చాయి. ప్రిన్స్ హ్యారీ కేవలం రాచపుటక పుట్టాడు కనకే సైన్యంలో చేరగలిగాడని కొందరు ఎద్దేవా చేశారు కూడా.తాజాగా బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలెస్ కూడా హ్యారీపై దుమ్మెత్తిపోశారు. ‘‘ఆ పిలగాడు డంబాలు చెప్పుకుంటున్నాడు. తను మాత్రమే ఎక్కువ చంపానని అంటే, మిగతావాళ్లు అంత పనికిమాలిన వాళ్లా? కాస్త వినయం ఉండాలి.
ఆర్మీలో పోరాటం ముఖ్యం. ఎవరు ఎంతమందిని చంపారన్నది కాదు. కొందరు ఎక్కువ మంది చంపొచ్చు. కొందరు తక్కువ మందిని చంపొచ్చు. తోటివాళ్లు తక్కు చేయకూడదు’’ అని అన్నారు. హ్యారీ మిగతా సైనికుల శక్తిసామర్థ్యాలను తక్కువ చేసి మాట్లాడారని, అది మంచి పద్ధతి కాదని తలంటాడు. తను పాతిక మంది తాలిబన్లను ’‘చదరంగంలోని పావుల్లా లేపేశాను,’’ అని హ్యారీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మానసిక సమస్యలతో బాధపడుతున్న సైనికులు ఆత్మహత్య చేసుకోకుండా ఉండటానికే ఆ లెక్కల చెప్పానన్నారు.