1000 మంది పాకిస్తానీల్లో 200 మంది గేలు - MicTv.in - Telugu News
mictv telugu

1000 మంది పాకిస్తానీల్లో 200 మంది గేలు

December 3, 2017

పాకిస్తాన్‌లో వేధింపులకు తట్టుకోలేక విదేశాలకు పారిపోతున్న వారిలో స్వలింగ సంపర్కులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తేలింది. వీరిలో ప్రతి ఐదుగురిలో ఒకరు స్వలింగ సంపర్కులు. బ్రిటన్ హోం శాఖ అధికారులు ఈ గణాంకాలు వెల్లడించారు.వెయ్యిమంది పాకిస్తానీలు తమ దేశంలో ఆశ్రయం కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 200 మంది గేలు ఉన్నరని యూకే అధికారులు తెలిపారు. అయితే ఈ దరఖాస్తుల్లో 70 శాతం తిరస్కరణకు గురయ్యాయి. ముస్లిం దేశమైన పాకిస్తానీలో స్వలింగ సంపర్కంపై నిషేధం ఉంది. ఈ నేరానికి జైలు శిక్ష పడుతుంది. అందుకే చాలామంది దేశం విడిచిపోతున్నారు.

2015-17 మధ్యకాలంలో మొత్తం 58 వేల మంది తమ దేశంలో ఆశ్రయం కోరారని, వీరిలో ఆరు శాతం మంది.. అంటే 3535 మంది స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులు(బైసెక్సువల్స్), లెస్బియన్లు, గట్రా ఉన్నారని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ కేటరిరీల్లో మూడింట రెండు వంతుల మంది దరఖాస్తులను తోసిపుచ్చామని తెలిపింది. గే, లెస్బియన్, బైసెక్సువల్ వంటి కారణాలతో ఆశ్రయం కోరుతున్నవారిలో అత్యధికంగా పాక్, బంగ్లాదేశ్, నైజీరియా వాసులు ఉన్నారని పేర్కంది. ఇలాంటి కారణంతో భారత్ నుంచి ఒక్క దరఖాస్తు కూడా రాలేదని పేర్కొంది.