Britain police officers incident before Queen Elizabeth funeral
mictv telugu

బ్రిటన్ రాణి అంత్యక్రియల్లో రక్తపాతం.. కత్తిపోట్లు..

September 16, 2022

Britain police officers incident  before Queen Elizabeth  funeral

బ్రిటన్‌ రాణి రెండో ఎలిజబెత్‌ అంత్యక్రియలు కలకలం రేపుతున్నాయి. శవపేటిక దగ్గరున్న ఓ సైనికుడు స్పృహతప్పి పడిపోయిన ఉదంతాన్ని మరవక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. లీసెస్టర్ స్క్వేర్‌లోరాణి శవపేటికను ఉంచిన స్థలానికి దగ్గర్లో గుర్తుతెలియని దుండగుడు ఇద్దరు పోలీసు అధికారులను కత్తితో పొడిచాడు.

గాయపడిన వారిలో ఒకరు మహిళా పోలీస్. దాడులకు పాల్పడతాడనే సమాచారం రావడంతో పోలీసులు ఒక దుండగుణ్ని అదుపులోకి తీసుకుంటున్నప్పుడు అతడు కత్తితో దాడిచేశాడు. ఘటనలో అతడూ గాయపడ్డాడు. ముగ్గురినీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన వెనక ఉగ్రవాద కోణం లేదని స్పష్టం చేశారు. విషయం తెలుసుకుని దిగ్భ్రాంతి చెందాని నగర మేయర్ చెప్పారు. ఎలిజబెత్ అంత్యక్రియలు ఈ నెల 19న సర్వ అధికార లాంఛనలతో జరగునున్నాయి. దేశదేశాల అధినేతలు తరలివస్తుండడంతో లండన్ నగరంలో వేలమంది పోలీసులను మోహరించి తనిఖీలను ముమ్మరం చేశారు.