కాబోయే బ్రిటన్ రాజుకు కరోనా.. రాచకుటుంబంలో అలజడి  - MicTv.in - Telugu News
mictv telugu

కాబోయే బ్రిటన్ రాజుకు కరోనా.. రాచకుటుంబంలో అలజడి 

March 25, 2020

nhvhjh

బ్రిటన్ రాచవంశం రోగభయంతో గజగజా వణుకుతోంది. ఇప్పటికే బ్రిటన్ రాణి సహాయకుడికి వైరస్ సోకగా, తాజాగా కాబోయే రాజు, ప్రస్తుత రాణి రెండో ఎలిజబెత్ కొడుకు ప్రిన్స్ చార్లెస్‌కు కూడా మహమ్మారి అంటుకుంది. అయితే ఆయన ఆరోగ్య బేషుగ్గానే ఉందని అధికారులు చెబుతున్నారు. 

స్కాంట్లాండులో ఉన్న 71 ఏళ్ల చార్లెస్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని, ఆయన భార్యకు మాత్రం నెగిటివ్ వచ్చిందని చార్లెస్ ప్రతినిధులు తెలిపారు. ‘ప్రభుత్వం ఆదేశాలు, వైద్యు సూచనల మేరకు భార్యాభర్తలు ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉన్నారు. యువరాజా వారికి ఎవరివల్ల ఈ రోగం సోకిందో తెలియడం లేదు..’ అని పేర్కొన్నారు. 93 ఏళ్ల ఎలిజబెత్ రాణిని కరోనా భయంతో ఇటీవల బకింగ్ హామ్ రాజప్రాసాదం నుంచి విండ్సర్ కోటకు తరలించారు. దివంగత యువరాణి డయానా భర్త అయిన చార్లెస్ ఆమె మరణం తర్వాత రెండో పెళ్లి చేసుకున్నారు. డయానా, చార్లెస్‌ల రెండో కొడుకు హ్యారీ రాచరిక హంగులను ఇటీవలే వదులుకున్నాడు. అయితే సెక్యూరిటీ, ఇతర చిన్నచిన్న లాంఛనాలను అనుభవిస్తూనే ఉన్నాడు.