Britain queen Elizabeth death Iran tv scholar Foad Izadi of Tehran University
mictv telugu

బ్రిటన్ రాణి చావుతో శుభం, శిక్ష తప్పించుకుంది.. ఇరాన్

September 13, 2022

బ్రిటన్ దివంగత రాణి రెండో ఎలిజబెత్ మృతిపై ఆ దేశంతోపాటు పలు కామన్వెల్త్ దేశాల్లో ప్రగాఢ సంతాపం పాటిస్తున్నారు. తమ ప్రియతమ రాణి పోయిందని కొందరు కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తుంటే, పీడ పోయిందని మరికొందరు పండగ చేసుకుంటున్నారు. ఆ ఆధునిక కాలంలో రాచరికమేమిటని, ఆయుష్షు తీరి చనిపోతే ఈ ఏడుపులేమిటని బ్రిటన్‌లోనూ కొందరు విమర్శిస్తున్నారు. ఇరాన్ మరో అడుగు ముందుకేసి తిట్లకు లంకించుకుంది.

‘‘రాణి చావడం ప్రపంచానికి శుభం. మానవజాతి చరిత్రలో కరడుగట్టిన నేరస్తుల్లో ఆమె ఒకతె. ఆమె పాలనంతా నేరాలు, రోత, పాపాలు..’’ అని ఇరాన్ ప్రభుత్వ టీవీ చానల్ దుమ్మెత్తి పోసింది. ఆమెను నరహంతక హిట్లర్ తో పోల్చింది. టెహ్రాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫోయాద్ ఇజాదీ టీవీ చానల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. రాణి డెబ్బయ్యేళ్ల పాలన ఘోరాల్లో జరిగాయి కనకు ఆమెను హిట్లర్ సరసన చేర్చాలని ఆయన అన్నారు. ‘‘ఆమె పోయినందుకు మేమూ బాధపడుతున్నాం. ఆమె తన నేరాలకు శిక్ష అనుభవించకుండానే పోయింది. ఆమె సామ్రాజ్యవాది. యుద్ధనేరస్తురాలు. బ్రిటిష్ సైనిక మూకలను ప్రపంచమంతా పంపి నేరాలు చేయించింది. లక్షల మంది చావుకు కారణమైంది. హిట్లర్ సరసన చేరాల్సిన అమెరికా అధ్యక్షులూ ఉన్నారు.’ అని అన్నారు.