Home > Featured > రాణి అంత్యక్రియల్లో లైంగిక వేధింపులు, మరెన్నో..

రాణి అంత్యక్రియల్లో లైంగిక వేధింపులు, మరెన్నో..

Britain queen Elizbeth funeral unwarranted incidents

బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ అంత్యక్రియల్లో పలు అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. శవపేటిక వద్ద ఉండే సైనికుల్లో ఒకరు గుండెపోటుతో కుప్పకూలిపోగా, సమీపంలో ఓ దుండగుడు ఇద్దరు పోలీసులను కత్తితో పొడిచాడు. తాజా ఓ కామాంధుడు రాణిని కడసారి చూడ్డానికి వచ్చిన జనంలో దూరి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విక్టోరియా టవర్ గార్డెన్స్ వద్ద క్యూలో నిల్చున్న ఇద్దరు మహిళలపై అడియో అదేషైన్ అనే 19 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. చుట్టుపక్కల వాళ్లు గమనించడంతో పోలీసులకు దొరక్కుండా థేమ్స్ నదిలోకి దూకేశాడు. పోలీసులు అతన్ని వదిలేయకుండా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

మరోపక్క.. రాణి శవపేటికపైకి దూసుకెళ్లి రాజదండాన్ని పట్టుకోడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఆ ఆకస్మిక పరిణామంతో నివ్వెరపోయిన పోలీసులు వెంటనే అతణ్ని లాగి కిందపడేసి అదుపులోకి తీసుకున్నారు. అతడు ఏకంగా 14 గంటల పాటు క్యూలో నిల్చుని శవపేటిక వద్దకు వెళ్లగా దాన్ని ఊపే ప్రయత్నం చేయడంతోపాటు అక్కడ జెండాను కూడా తీసేయాలని ప్రయత్నించాడు. మానసిక పరిస్థితి బాలేక అలా చేసి ఉంటాడని భావిస్తున్నారు.
Britain queen Elizbeth funeral unwarranted incidents
Britain queen, Elizbeth funeral, unwarranted incidents, coffin, que incidents

Updated : 17 Sep 2022 4:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top