British Airways' New Uniform Includes Hijab And Jumpsuit
mictv telugu

బ్రిటీష్ ఎయిర్ వేస్ కొత్త యూనిఫామ్!

January 11, 2023


బ్రిటీష్ ఎయిర్ వేస్ 20 యేండ్ల తర్వాత తొలిసారిగా తన కొత్త యూనిఫామ్ ను ఆవిష్కరించింది. విమానయాన సంస్థ మహిళా క్యాబిన్ సిబ్బంది ఇప్పుడు జంప్ సూట్ లను కావాలనుకుంటే హిజాబ్ తో ధరించేందుకు వీలుగా డిజైన చేశారు.

డిజైనర్.. టైలర్ ఓజ్వాల్డ్ బోటెంగ్ ఓబీఈ రూపొందించారు. ఐదేళ్ల పాటు చేసిన కృషికి తగిన ఫలితం వచ్చేసింది.డ బ్రిటీష్ ఎయిర్ వేస్ చైర్మన్, సీఈఓ సీన్ డోయల్.. ‘మా యూనిఫాం అనేది మా బ్రాండ్ ఐకానిక్. ఇది మన భవిష్యత్తులోకి మనల్ని తీసుకెళుతుందని. ఆధునిక బ్రిటన్ లో అత్యుత్తమమైన బ్రిటన్ కు ప్రాతినిధ్యం వహిస్తుంది. మా కోసం గొప్ప బ్రిటీష్ ఒరిజనల్ సర్వీస్ ను అందించడంలో మాకు సహాయపడుతుంది. మా దగ్గర పని చేసేవాళ్లు గర్వంగా ధరించే యూనిఫామ్ ను రూపొందించాలని కోరుకున్నాం. 1500మంది సహోద్యుగుల సహాయంతో దీన్ని పంపిణీ చేశాం’ అంటూ తెలియచేశారు.

హిజాబ్ తో..
ఏ సంస్థకైనా ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉంటుంది. బ్రిటీష్ ఎయిర్ వేస్ కూడా అలాగే కోరుకుంది. 20 యేండ్ల నుంచి ఒకే డ్రెస్సింగ్ తో ఉనవాళ్లకు ఇప్పుడు కొత్త యూనిఫామ్ లు వచ్చాయి. ఇందులో కొంత ప్రత్యేకత ఉంది. ఈ కలెక్షన్స్ లో పురుషుల కోసం సాధారణ, స్లిమ్ ఫిట్ స్టయిల్ ట్రౌజర్స్, షర్ట్.. ఇలా సూట్ ను కొట్టించారు. అలాగే ఆధునిక జంప్ సూట్ తో పాటు, హిజాబ్ కూడా ఇందులో ఉండేలా డిజైన చేశారు. అయితే ఈ యూనిఫామ్ ఎయిర్ వేవ్ నమూనా విమానం రెక్కపై గాలి కదలకి ద్వారా ప్రేరణ పొందినట్లు డిజైనర్ చెప్పారు. అంతేకాదు.. ఈ యూనిఫామ్ రూపకల్పన కూడా చాలా శ్రమతో కూడుకున్నది. ఎందుకంటే.. పాత యూనిఫారాన్ని దాదాపు 90శాతం రీ సైకిల్ చేసిన పాలిస్టర్ తో ఈ ఫ్యాబ్రిక్ ని తయారు చేశారు. ఎమ్మాకేరీ బ్రిటీష్ ఎయిర్ వేస్ క్యాబిన్ సిబ్బంది.. ‘కొత్త యూనిఫామ్ ను పరీక్షించాం. 35వేల అడుగుల ఎత్తులో దాన్ని తీసుకెళ్లడం నా బాధ్యత. వేలాది మంది మా మీద నమ్మకంతో విమానం ఎక్కుతుంటారు. అంతేకాదు.. అప్రాన్ లకు పాకెట్స్ కూడా పెద్దగా ఇచ్చారు. దీనివల్ల భోజన సేవలకు మాకు మరింత ఉపయోగం ఉంటుంది’ అంటూ పేర్కొంది.