British angler caught the biggest goldfish in france
mictv telugu

వలకు చిక్కిన భారీ గోల్డ్ ఫిష్.. బరువు 30 కేజీలు

November 22, 2022

British angler caught the biggest goldfish in france

అక్వేరియంలలో సరదాగా పెంచుకునే గోల్డ్ ఫిష్ గురించి వినే ఉంటారు. చిన్నగా, ముద్దుగా ఉంటూ ఆహ్లాదాన్ని పంచుతుంది. పెద్దలు, పిల్లలు దాని రంగు, రూపు చూసి మురిసిపోతుంటారు. కానీ అదే గోల్డ్ ఫిష్ భారీ సైజులో 30 కేజీల బరువుతో ఉంటుందంటే నమ్ముతారా? ఫ్రాన్స్ లో ఆండీ హాక్కెట్ అనే ఓ బ్రిటీష్ జాలరికి ఈ భారీ సైజు గోల్డ్ ఫిష్ దక్కింది.

బ్లూ వాటర్ అనే చెరువులో వల వేసిన జాలరికి ఈ చేప చిక్కడానికి 25 నిమిషాలు పట్టింది. ‘చెరువులో గోల్డ్ ఫిష్ ఉందని తెలుసు. కానీ చిక్కుతుందని అనుకోలేదు. ఫోటోలు, వీడియోలు తీసి చేపను మళ్లీ నీటిలోకే వదిలేసాను’ అని సదరు జాలరి తెలిపాడు. 30.50 కేజీలతో ప్రపంచంలోనే అతి పెద్ద గోల్డ్ ఫిష్ గా నిలిచిందని జాలరి వివరించాడు.