Home > Featured > అమెరికా కుక్కకు ఘన సన్మానం.. ఏం చేసిందంటే?

అమెరికా కుక్కకు ఘన సన్మానం.. ఏం చేసిందంటే?

Dog ..

సాధారణంగా మనుషులకు సన్మానాలు, అవార్డులు ఇచ్చి గౌరవించడాలు చేస్తుంటారు. కానీ బ్రిటన్‌కు చెందిన సంస్థ ఒకటి కుక్కకు సన్మానం చేసి గౌరవించింది. ‘బ్రిటన్ వెటెరినరీ చారిటీ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ అవార్డును ప్రకటించింది. శునకాన్ని ఇంతగా గౌరవించడానికి ఓ భారీ కారణమే ఉంది. అది అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ఉండే వైట్ హౌజ్‌లో కాపలా కాసే జాగిలం. దాని ధైర్య సాహసాలకు గుర్తింపుగా అవార్డు లభించింది.

బెల్జియం మాలినోయిస్ జాతికి చెందిన హరికేన్ అనే కుక్క బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాపాలా కాసేది. 2014లో ఓ దుండగుడు వైట్‌హౌజ్ లోపలికి వచ్చి ఒబామాపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అతని రాకను పసిగట్టిన హరికేన్ పులిలా అతడి మీదపడి దాడి చేసింది. కుక్కతో పోరాడలేక అతడు కిదపడిపోయాడు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి వచ్చి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. హరికేన్ పోరాడిన విధానాన్నిచూసిన PSDA సంస్థ దానికి అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించింది. 2016లో అమెరికా సీక్రెట్ సర్వీస్ నుంచి ఈ శునకం రిటైర్మెంట్ తీసుకుంది.

Updated : 30 Aug 2019 2:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top