పురుషాంగం చిన్నగా ఉందని ఓ సహోద్యోగిని నలుగురి ముందు ఎగతాళి చేశాడు ఓ పోలీస్ అధికారి. యూకేలోని విల్డ్ షైర్ పోలీస్ డిపార్ట్మెంట్లో గతేడాది జరిగిన ఈ దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోని వచ్చింది. డిపార్ట్మెంట్లో పనిచేసే ఆడమ్ రీడ్స్ అనే అధికారి.. కొత్తగా ఉద్యోగంలో చేరిన వ్యక్తి పట్ల అందరి ముందే జుగుప్సకరంగా ప్రవర్తించాడు. అతని ప్యాంటు విప్పించి, అతని పురుషాంగం సైజ్ చిన్నదిగా ఉందని హేళన చేశాడు. దీంతో సదరు వ్యక్తి.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అధికారులు ఘటనపై సీరియస్ అయ్యారు.
ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఆడమ్ రీడ్స్ను విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత.. అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు విచారణలో.. ఆడమ్ తన తప్పును అంగీకరించాడు. తాను కావాలని… చేయలేదని సరదాగా ఆటపట్టించడం కోసం చేశానని అన్నాడు. ఒక వ్యక్తి వ్యక్తిగత విషయాలను అందరిముందు ప్రస్తావించి, అతనికి ఇబ్బందులు గురిచేసినందుకు గాను ఉద్యోగంలో నుంచి తొలగించారు. అదే విధంగా, అతను యూకేలో మరోసారి ఏ పోలీసు డిపార్ట్ మెంట్ లో చేరకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.ఈ సంఘటన గతేడాది నవంబరు 2021 లో డివైజెస్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. అడమ్ రీడ్స్ వైఖరిపై విల్ట్షైర్ డిప్యూటీ చీఫ్ కానిస్టేబుల్ పాల్ మిల్స్ స్పందించారు. అడమ్ అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా, సహోద్యోగి గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించాడని పేర్కొన్నారు.