British High Court dismissed Nirav Modi's petition
mictv telugu

నీరవ్ మోదీకి బ్రిటన్ హైకోర్టు షాక్.. ఇండియాకు అప్పగించాలని ఆదేశం

November 9, 2022

British High Court dismissed Nirav Modi's petition

బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి బ్రిటన్ హైకోర్టు షాకిచ్చింది. భారత్‌‌కు తనను అప్పగించవద్దని మోదీ వేసిన పిటిషన్‌‌ను కొట్టి వేసింది. మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం నీరవ్ మోదీని ఇండియాకు అప్పగించాలని ఆదేశించింది.

అంతకు ముందు ఫిబ్రవరిలో జిల్లా కోర్టులో ఇదే తీర్పు వచ్చింది. కానీ, దానిని నీరవ్ మోదీ హైకోర్టులో సవాలు చేశారు. తన మానసిక ఆరోగ్యం సరిగా లేదని కోర్టులో ఆయన వాదించారు. కానీ హైకోర్టు కింది కోర్టు నిర్ణయాన్నే సమర్ధించింది. కాగా, నీరవ్ మోదీ ప్రస్తుతం ఆగ్నేయ లండన్‌‌‌లోని వాండ్స్ వర్త్ జైలులో ఉన్నారు. భారత్‌‌లో ఆయనపై తప్పుడు లోన్ అగ్రిమెంట్లను సమర్పించి పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వేల కోట్లు రుణం తీసుకున్న కేసుపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. రుణంగా తీసుకున్న డబ్బుతో మనీలాండరింగ్‌‌‌కు పాల్పడ్డారనే కేసులో ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది. ఇవేకాక, ఆధారాల ధ్వంసం, సాక్షులను బెదిరించడం వంటి ఆరోపణలపై కూడా కేసులు నమోదు అయ్యాయి.