British Parliament felicitates BCCI President Sourav Ganguly
mictv telugu

బెంగాల్ టైగర్‌ను సత్కరించిన బ్రిటిష్ పార్లమెంట్

July 14, 2022

బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం లభించింది. గంగూలీని బ్రిటిష్ పార్లమెంట్ సత్కరించింది. ఈ విషయాన్ని గంగూలీ స్వయంగా వెల్లడించాడు. బ్రిటిష్ పార్లమెంటు తనను ఒక బెంగాలీగా సత్కరించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఈ సన్మానం కోసం ఆరు నెలల కిందటే తనను సంప్రదించిందని వెల్లడించాడు. పార్లమెంట్ ప్రతి ఏడాది ఒకరిని ఇలా గౌరవిస్తుందని, ఈ సారి ఆ అవకాశం తనకు లభించిందని చెప్పాడు.

2002 జులై 13న లార్డ్స్‌ వేదికగా జరిగిన నాట్‌వెస్ట్‌ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించింది టీమిండియా. మ్యాచ్‌ విజయం అనంతరం గంగూలీ షర్ట్‌ విప్పి గాల్లోకి గిరాగిరా తిప్పిన ఫొటోలు, వీడియోలు అప్పట్లో సంచలనం రేపాయి. కాగా ఈ మ్యాచ్‌ జరిగి (జులై 13) సరిగ్గా ఇరవై ఏళ్లయ్యాయి. ఈ సందర్భంగా సౌరభ్‌ గంగూలీని బ్రిటిష్‌ పార్లమెంట్‌ ఘనంగా సత్కరించింది. ఈ సన్మాన కార్యక్రమంలో గంగూలీ సతీమణి డోనా గంగోపాధ్యాయ కూడా పాల్గొన్నారు. ఈసారి బోర్డు అధ్యక్షుడు తన పుట్టినరోజును అక్కడే గడిపారు. ఇంగ్లండ్‌లో భారత జట్టు పర్యటన కూడా కొనసాగుతోంది.