British Prime Minister Liz Truss resigns
mictv telugu

బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా.. ఎందుకంటే

October 20, 2022

British Prime Minister Liz Truss resigns

బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ గురువారం రాజీనామా చేశారు. ఈ పదవిలో ఆమె కేవలం 45 రోజులు మాత్రమే ఉన్నారు. ఈ సందర్భంగా ‘తప్పుడు పనులు చేశాం. క్షమించండి’ అంటూ ఆమె దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఆమె తీసుకున్న ఆర్దిక నిర్ణయాలతో దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది.

పెరిగిన ధరలతో ప్రజలు చితికిపోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమవడంతో ట్రస్ తాజా నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ముందు ఇవే కారణాలతో పలువురు మంత్రులు రాజీనామా చేశారు. కాగా, దీంతో బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం మళ్లీ మొదటికొచ్చింది. తదుపరి ప్రధాని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సనాక్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే జరిగితే తొలి భారత సంతతి ప్రధానిగా రికార్డు సాధిస్తారు.