British Prime Minister's resignation.. rishi sunak in the race!
mictv telugu

బ్రిటన్ ప్రధాని రాజీనామా.. రేసులో ఇన్ఫోసిస్ అల్లుడు!

July 7, 2022

గ్రేట్ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ ప్రభుత్వం నుంచి ఇప్పటికే 40 మంది మంత్రులు రాజీనామా చేశారు. దీంతో బోరిస్‌ రాజీనామా చేయకతప్పలేదు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ కూడా రాజీనామా చేశారు. కొత్త ప్రధాని పదవి చేపట్టేంతవరకు బోరిస్ పదవిలో ఉంటారు. ఇక తరువాతి ప్రధాని ఎవరు అనేదానిపై చర్చ మొదలైంది. ఇందులో రిషి సునక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కోవిడ్ సమయంలో ఆయన 10 బిలియన్ పౌండ్ల మేర సహాయం చేయడంతో ఈయన పేరు ప్రముఖంగా వినిపించింది. 2020లో బోరిస్ జాన్సనే రిషిని చాన్స్‌లర్‌గా నియమించారు. కరోనా కాలంలో బోరిస్ బర్త్‌డే పార్టీకి హాజరై జరిమానా కూడా ఎదుర్కొన్నారు. డిషీ పేరుతో ఫేమస్ అయిన ఈయన తాతలు పంజాబ్ నుంచి బ్రిటన్‌కు వలస వెళ్లారు. ఇక కాలిఫోర్నియాలో చదివేటప్పుడు పరిచయమైన ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి కూతురు అక్షత మూర్తిని వివాహం చేసుకున్నారు. వీరికి కృష్ణా సునక్, అనౌష్క సునక్ అనే ఇద్దరు కుమార్తెలు సంతానం. కాగా, పాలనా పరమైన వైఫల్యాలతో పాటు తన ప్రభుత్వంలోని చట్టసభ సభ్యులపై లైంగిక ఆరోపణలు రావడం, కరోనా సమయంలో నిబంధనలను అతిక్రమించడం లాంటి వాటితో బోరిస్ పదవికి రాజీనామ చేశారు.